Wednesday, December 7, 2011

అమ్మాయిలతో గెస్ట్ హౌస్‌లో మంత్రి పిఏ రాసలీలలు

ఏలూరు: ఓ మంత్రి పిఏ బుధవారం అడ్డంగా బుక్కయ్యారు. మంత్రి పితాని సత్యనారాయణ పిఏ కొండల రావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అతిథి గృహంలో ఓ అమ్మాయితో రాసలీలలు జరుపుతుండగా మీడియా కంటబట్టారు. ఈ రాసలీలల విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. వారి రాకను గమనించిన పిఏ వెంటనే గోడ దూకి అక్కడ నుండి పరార్ అయ్యాడు. పోలీసులు, మీడియా కనిపించడంతో ఆ అమ్మాయి బాత్‌రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టేసుకుంది.

ఉదయం పది గంటల సమయంలో అటెండర్ ఓ అమ్మాయని బైక్ పై తీసుకు వచ్చి గెస్ట్ హౌస్ వద్ద వదిలాడు. అమ్మాయిని తీసుకు వచ్చిన వ్యక్తే గెస్ట్ హౌస్ కు కాపలాగా ఉన్నాడు. ఆ రూం కూడా మంత్రి పిఏ పేరుతోనే బుక్ అయింది. కాగా ఆ అమ్మాయి పిఏ కజిన్ అని అటెండర్ చెబుతున్నారు.

No comments:

Post a Comment