Tuesday, December 13, 2011

జగన్‌ వర్గంతో కాంగ్రెస్‌ జగడం

* 16 మందిపై వేటుకు రంగం సిద్ధం
* ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు కంప్లైంట్‌
* వేటుపై వీడని సస్పెన్స్‌!
* ఈనెలాఖరులో ఉంటుందని ప్రచారం
* పూతలపట్టు రవిపై కనికరం!
* సోమారపు పిటిషన్‌పై డైలామా!


ఊహించినట్లే జగన్‌ వర్గంపై వేటు వేసేందుకు కాంగ్రెస్‌ డిసైడ్‌అయింది. ఈ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో సస్పెన్స్‌ వీడింది. నయానో... భయానో బుజ్జగించేందుకు ఏడాది కాలంగా చేసిన ప్రయత్నం అసెంబ్లీ సాక్షిగా బెడిసి కొట్టడంతో వారిని వదిలించుకునేందుకే మొగ్గు చూపింది. హైకమాండ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేయడంతో క్షణం ఆలస్యం చేయకుండా వేటుపై కంప్లైంట్‌ ఇచ్చింది.

గత ఏడాది కాలంగా కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారిన 16 మంది సొంత పార్టీ MLAలపై యాక్షన్‌ మొదలు పెట్టింది హైకమాండ్‌. TDP ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. జగన్‌కు జై కొట్టిన 16 మంది MLaలపై అనర్హత పిటిషన్‌తో వేటు వేయాలని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు కంప్లైంట్‌ చేశారు విప్‌ కొండ్రు మురళి. 

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పటి నుంచి వీరి వేటుపై తర్జన భర్జనలు పడ్డ కాంగ్రెస్‌ నేతలందరి మధ్యా వేటు వేయాలన్న ఏకాభిప్రాయం కుదరడంతో హైకమాండ్‌ తక్షణమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దీంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర కసరత్తు చేసిన అధికార పార్టీ రాత్రి విప్‌ కొండ్రు మురళీతో అనర్హత పిటిషన్‌ దాఖలు చేయించింది. 

పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, గొల్ల బాబూరావు, అమర్‌నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెన్నకేశవరెడ్డి, టి.బాలరాజు, ఎం.ప్రసాదరాజు, శ్రీనివాసులు, కొండా సురేఖ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధర్మాన కృష్ణదాసు, శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాధరెడ్డిలపై వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ విడివిడిగా లేఖలందించారు. 

చిత్తూరు జిల్లా పూతలపట్టు MLA డాక్టర్‌ రవి అనారోగ్య కారణాల వల్లే అవిశ్వాసం సందర్భంగా ఓటింగ్‌కి దూరంగా ఉన్నట్లు వివరణ ఇవ్వడంతో సాటిస్‌ ఫై అయిన హైకమాండ్‌ ఆయనను కనికరించింది. అయితే కరీంనగర్ జిల్లా రామగుండం MLA సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా విజయం సాధించినప్పటికీ... కాంగ్రెస్‌కు అనుబంధ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 

మొన్న విప్‌ ఉల్లంఘించడంతో ఆయనపై అనర్హత పిటిషన్‌పై మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించిన కడప జిల్లా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిపై గతంలో ఇచ్చిన అనర్హత పిటిషన్‌ ఉపసంహరించుకుంటామని విప్‌ కొండ్రు మురళి వెల్లడించారు. 

No comments:

Post a Comment