హైదరాబాద్: బాలకృష్ణ రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌లోకి రావాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం నందమూరి అందగాడికి సూచించారు. బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలయ్య ఇప్పటికే సినీ జీవితంలో తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని కితాబునిచ్చారు. ఆయన ఇక రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి రావాలని సూచించారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు.
సినీ రంగంలోనే కాకుండా ప్రజా సేవలో కూడా తండ్రిని మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. సత్యసాయి ట్రస్టు మాదిరిగానే ఈ ఆసుపత్రి కూడా మొబైల్ హాస్పిటల్ వ్యాన్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించాలన్నారు. వైద్యులు సంపాదనే ధ్యేయంగా పని చేయవద్దన్నారు. వైద్యులు కనీసం నెలలో ఒకరోజైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
Tuesday, December 6, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment