డొల్లతనం,మంత్రివర్గంలో వున్న లొసుగులు,చిరంజీవిలోని లోభితనం ,అవినీతి
యువరాజా వారిలోని చేవ .."తెలుగుదేశం" పార్టీలోని కట్టుబాటు,కార్యదీక్షత ఈ
ఆంద్ర రాష్ట్ర ప్రజలకు అర్ధం అయిపోయాయి....
గిట్టుబాటు ధర అందకనో లేక మరేవరిదన్నా
దర్శకత్వమో ఏమో గాని ...కన్నబాబు(PRP MLA) గారు కాంగిరేసు ప్రభుత్వంలోని
లోపాలను, అవినీతిని అంగీకరిస్తూనే.. ప్రభుత్వాన్ని కాపాడుతున్నాము అని..
ఎప్పటిలాగానే "ప్రజారాజ్యం"లోని లోభితనాన్ని,ధనరాజకీయాన్ని మరోసారి
ప్రజలకి చాటుకున్నారు....
"పరిటాల" హత్యకేసులో ముద్దాయిగా వున్న "జగన్మోహన్ రెడ్డి"ని,
అసెంబ్లీలో కాపాడిన ఈ "ముఖ్యమంత్రి" మీదా.. మీరు అవిశ్వాసం పెట్టేది??
అని, "ముఖ్యమంత్రి"ని దోషిగా చిత్రించే ప్రయత్నం చేసిన "బొత్సా"(Congress
President) మాటలు,కాంగిరేసు ప్రభుత్వ మీద ఆ మంత్రులకే విశ్వాసం లేదన్న
విషయాన్ని మరోసారి నిరూపించాయి.."ముఖ్యమంత్రి" అంటే ఎంత చులకన భావమో
ప్రజలకు తెలిసేలా చేసాయి ..
"కిరణ్ కుమార్" సర్కారులో రైతన్న నిండా మోసపోతున్నాడు,
అని రోజు ఉపన్యాసాలు ఇచ్చే "జయప్రకాష్ నారాయణ" గారు.. తాను ఆదర్శాలు
వల్లించటానికే తప్ప వాటిని ఆచరణలో చూపటానికి కాదని...తన తటస్థ వైఖరి
ద్వారా మరొక్కసారి నిరూపించారు...
"తెలంగాణా" ప్రాంత రైతులు, కరువు కోరల్లో చిక్కుకుని
విలవిల లాడుతుంటే.. "తెలంగాణ" పేరు చెప్పి "ఓట్లు-సీట్లు" ఆటలాడే KCR
కుటుంభం, తమ MLA (చెన్నమనేని రమేష్ )ని "అవిశ్వాస" పరీక్షకి దూరంగా
వుంచి, ప్రభుత్వంతో తాను చేసుకున్న లోపాయికారీ "విశ్వాస" ఒప్పందాన్ని
మరోసారి బహిర్గతం చేసారు...
పక్కా ప్రణాళికతో రైతాంగ సమస్యల మీద సంపూర్ణంగా చేసిన
అధ్యయనానికి.. క్షేత్ర స్థాయిలో "రైతుపోరు"తో "చంద్రబాబు" పరిశీలించిన
అంశాలను క్రోడీకరించి రైతాంగ కష్టాలను, ప్రజాసమస్యలను అసెంబ్లీలో
సమర్ధంగా వినిపించి.. ప్రభుత్వ అసమర్ధతను ఎండకట్టిన తెలుగుదేశం MLA లకు,
నాయకులకు పేరు పేరునా రాష్ట్ర రైతాంగం ఈరోజు కృతజ్ఞతలు చెప్తుంది అంటే
..... అది మీలోని క్రమశిక్షణకు,సమర్ధతకు తార్కాణం.....
తెలుగుదేశం ఇదే ఆత్మవిశ్వాసంతో... ఇంతే సంకల్ప బలంతో.. యువశక్తిని
ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ... రాష్ట్ర సమస్యల మీద, ఈ అసమర్ధ పాలకుల
పనితీరు మీద అనునిత్యం పోరాడాలని ఆశిద్దాం....
--
Thanks & Regards,
Subbarao Talla
9010710999
No comments:
Post a Comment