Friday, December 9, 2011

సోనియా గాంధీపై మళ్లీ వైయస్ జగన్ కామెంట్

గుంటూరు: గత కొంత కాలంగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై
వ్యాఖ్యలు చేయడం మానేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్
జగన్ రూటు మార్చారు. ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని మళ్లీ
ప్రారంభించినట్లే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో
గురువారం ఆయన సోనియాపై వ్యాఖ్య చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల
కష్టంతోనే కేంద్రంలో సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.
మరణంచిన నేత వైయస్సార్‌ను ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని ఆయన
అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో
కుమ్మక్కయి రాజకీయ విలువలను నాశనం చేశారని ఆయన విమర్శించారు. వైయస్
రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే తమకు కష్టాలు ఉండేవి కావని ప్రజలు
తలుచుకుంటున్నారని ఆయన అన్నారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్ నుంచి ఆయన
గురువారం ఓదార్పు యాత్రను ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో ఆయన ఓదార్పు
యాత్ర గురువారంనాడు 36వ రోజుకు చేరుకుంది.

No comments:

Post a Comment