గోదావరి జిల్లాలో షాక్ తగిలింది. జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
యువజన విభాగం అధ్యక్షుడు పరువుల రాజా పార్టీకి రాజీనామా చేసినట్లుగా
వార్తలు వస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో
గురువారం కాంగ్రెసు పార్టీలో చేరారని సమాచారం. అసంతృప్తి కారణంగానే ఆయన
కాంగ్రెసు పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవలి కాలంలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ అసంతృప్తుల జాబితా పెరుగుతుండటం విశేషం.
జగన్ ఓదార్పు యాత్ర చేపడుతున్న గుంటూరు జిల్లాలోనూ ఇటీవల నేతల మధ్య
విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. ఒక వర్గానికి చెందిన నేతకు జిల్లా
ఇంచార్జ్ పదవి అప్పగించడం, ఇరువర్గాలు పోటా పోటీగా సభలు ఏర్పాటు చేసి తమ
సభకే రావాలని జగన్‌ను పట్టుబట్టడం తెలిసిందే. అంతకుముందు మాకినేని పెద
రత్తయ్య కూడా గ్రూపు విభేదాల కారణంగా పార్టీ వీడటానికి దాదాపు
సిద్ధమైపోయారు.
No comments:
Post a Comment